సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Feb 20, 2021 , 00:29:07

ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి

ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి

  • ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
  • బలవోనిపల్లిలో ఛత్రపతి విగ్రహ ప్రతిష్ఠాపన 

కోస్గి, ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను ప్రతి యువకుడు ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నా రు. మండలంలోని బలవోనిపల్లిలో శుక్రవారం ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. గ్రామ యువకులు శివాజీ విగ్రహం ప్రతిష్ఠించాలనే సంకల్పంతో తన వద్దకు వచ్చినప్పుడు వారి ఉత్సాహాన్ని చూసి వెంటనే విగ్రహం ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. హామీ మేరకు విగ్రహం ఇప్పించానన్నారు. అనంతరం ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సీఎ కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ నాయకుడికి అంతు చిక్కడంలేదన్నారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ మిషన్‌భగీరథ ఎలా సాధ్యపడిందని ఆశ్చర్యపోయారన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, ఎంపీపీ మధుకర్‌రావు, జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ భీంరెడ్డి, వైస్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌, కొడంగల్‌ మాజీ ఇన్‌చార్జి శాసం రామకృష్ణ, టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి ఓంప్రకాశ్‌, నాయకులు  రాజేశ్‌, హరి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo