మంగళవారం 09 మార్చి 2021
Narayanpet - Jan 23, 2021 , 00:17:16

టాఫిక్‌ నిబంధనలు పాటించాలి

టాఫిక్‌ నిబంధనలు పాటించాలి

నారాయణపేట, జనవరి 22 : వాహనదారు లు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పకుండా పాటించాల ని పోలీసులు ప్రజలకు సూచించారు. శుక్రవారం సింగారం చౌరస్తా వద్ద వా హనదారులు, ప్రజలకు రోడ్డు ప్రమాదాలు, భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపరాదని, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ, ఇన్సూరెన్స్‌ కలిగి ఉండాలన్నారు. మైనర్లు వాహనా లు నడుపరాదన్నారు. ప్రమాద రహిత జిల్లాగా పేరు తీసుకురావాలన్నారు. 


VIDEOS

logo