బుధవారం 03 మార్చి 2021
Narayanpet - Jan 13, 2021 , 00:28:32

దృఢంగా తయారు కావాలి

దృఢంగా తయారు కావాలి

నారాయణపేట టౌన్‌, జనవరి 12 : ప్రతిఒక్కరూ మానసికంగా ఉల్లాసంగా ఉంటూ, శారీరకంగా దృఢంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జిల్లా యువజన క్రీడల శాఖ, విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కె రన్‌ కార్యక్రమాన్ని పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న తనం నుంచే పిల్ల లు చురుకుగా ఉండేలా చూడాలన్నారు. వ్యాయామం, యోగా చేస్తూ ఉం డాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి జైపాల్‌రెడ్డి, బీసీ  సంక్షేమశాఖ అధికారి కృష్ణమాచారి, మున్సిపల్‌ వైస్‌ చైర్మ న్‌ హరినారాయణ భట్టడ్‌, ఎస్సై చంద్రమోహన్‌రావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జనార్ధన్‌రెడ్డి, తపస్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మార్కెట్‌ క మిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ చెన్నారెడ్డి పాల్గొన్నారు. 

ప్రాణదాతలు కావాలి

రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అదనపు కలెక్టర్‌ అన్నారు. పట్టణంలోని జిల్లా దవాఖానలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అంతకు ముందు దవాఖాన ప్రాంగణంలో వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ జగదీశ్‌, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మల్లికార్జున్‌, తపస్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. 


VIDEOS

తాజావార్తలు


logo