Narayanpet
- Jan 11, 2021 , 00:27:26
VIDEOS
ప్రతిభావంతులకు సన్మానం

కృష్ణ, జనవరి 10 : మండలంలోని కేజీబీవీలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని వైష్ణవి భరతనాట్యంలో జిల్లా స్థాయిలో మొదటి స్థానం సంపాదించి రాష్ట్ర స్థాయి పోటీకి ఎంపికయ్యారు. అలాగే గుడెబల్లూర్ గ్రామానికి చెందిన వాకిటి బస్వరాజ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, ఆసియా బుక్ రికార్డుల్లో చోటు సంపాదించిన సందర్భంగా మండల కేంద్రంలోని క్షీరలింగేశ్వర ఆలయంలో ఆదివారం బీసీ ఐక్యవేదిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక సంఘం నాయకులు, మండల పరిషత్ కోఆప్షన్ మెంబర్ అబ్దుల్ ఖదీర్, టీఆర్ఎస్ నాయకులు శివరాజ్‌పాటిల్, మౌనేశ్, సర్పంచ్ రాధామహదేవ్, శంకర్‌నాయక్, వెంకటేశ్, సంతోశ్, అమరేశ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING