రక్తదానం.. మరొకరికి ప్రాణదానం

- కలెక్టర్ హరిచందన
నారాయణపేట టౌన్: ఆరోగ్యవంతులైన వారు రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి పాలిట ప్రాణదాతలు కావాలని కలెక్టర్ హరిచందన పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని జిల్లా దవాఖానలో జిల్లా యంత్రాంగం తరఫున ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కొవిడ్ కారణంగా జిల్లా రక్తనిధి కేంద్రంలో సరిపడా రక్త నిల్వలు లేవని రెడ్‌క్రాస్ కన్వీనర్ సుదర్శన్‌రెడ్డి తెలియజేశారని,
దీంతో జిల్లా యంత్రాంగం ద్వారా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ శిబిరంలో 435 మంది రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. అన్ని దానాలలో రక్తదానం గొప్పదన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 121 మంది తలసేమియా వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నారన్నారు. ఇతర వ్యాధులు, ప్రమాదాల వల్ల రక్తం అవసరం ఉంటుందని వివరించారు. ప్రభుత్వ రక్తనిధిలో సరిపడా రక్త నిల్వలు ఉంచుకోవాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల వారిపై ఉందని చెప్పారు.
తక్కువ సమయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీపీవో మురళి, జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌సుధాకర్ ఏడీ శ్రీరామ్ ముఖ్య భూమిక పోషించారని కొనియాడారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా దాతలకు కొవిడ్ పరీక్షలు నిర్వహించి నెగెటివ్ నిర్ధారణ అయ్యాకనే రక్తాన్ని సేకరించినట్లు పేర్కొన్నారు. ఈ శిబిరంలో మొత్తం 244 మంది రక్తదానం చేసినట్లు రెడ్‌క్రాస్ కన్వీనర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, లయన్స్ క్లబ్ సభ్యులు హరినారాయణ భట్టడ్, వైద్యారోగ్యశాఖ అధికారి జయచంద్రమోహన్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ మల్లికార్జున్, రెడ్‌క్రాస్ సొసైటీ మహబూబ్‌నగర్ చైర్మన్ లయన్ నటరాజ్, జిల్లా కన్వీనర్ సుదర్శన్‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది రక్తదాతలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ‘సచిన్, కోహ్లి సెంచరీలు చూశాం.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ సెంచరీలు చూస్తున్నాం’
- ఫాతిమా జంక్షన్లో పీవీ కాంస్య విగ్రహం
- ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా అప్డేట్
- హంగ్ వస్తే బీజేపీతో దీదీ దోస్తీ: ఏచూరి
- ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- కేంద్ర మంత్రికి లేఖ రాసిన మంత్రి కేటీఆర్
- శ్రీలంక క్రికెట్ డైరెక్టర్‌గా టామ్ మూడీ
- టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
- అంబేద్కర్ ఆదర్శనీయుడు : మంత్రి కొప్పుల ఈశ్వర్
- మయన్మార్‌లో నిరసనకారులపై కాల్పులు.. 18 మంది మృతి