రామగిరి, జూన్ 28 : పేదరికంతో ఇబ్బంది పడుతూ విద్యలో రాణించాలనే 30 మంది విద్యార్థులకు రూ.8.15 లక్షల స్కారల్షిప్స్ను వైఆర్పీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యేలిశాల రవిప్రసాద్ అందజేశారు. శనివారం నల్లగొండలోని ఆ సంస్థ కార్యాలయంలో ఎంబీబీఎస్, ఇంజినీరింగ్, హైస్కూల్, ప్రైమరీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫౌండేషన్ సహాయంతో ఇప్పటి వరకు 250 మందికి పైగా విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యేలిశాల హేమచంద్రం, యేలిశాల శరత్ చంద్ర, యామ దయాకర్, ఆడెళ్ల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Nalgonda : విద్యార్థులకు వైఆర్పీ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ అందజేత