హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను గురువారం ఇంటర్‌బోర్డు విడుదల చేసింది. పరీక్షలు ఈ నెల 25 నుంచి జరుగనున్నాయి. ఇంటర్‌బోర్డు హాల్‌టికెట్లను కళాశాలల లాగిన్‌లో అందుబాటులో ఉంచింది. ప్రిన్సిపాళ్లను కలిసి తీసుకోవచ్చని విద్యార్థులకు సూచించింది. కాగా ఎప్‌సెట్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఇంటర్ హాల్‌టికెట్ల ఆధారంగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నందునా.. కళాశాలలకు పంపించారు. మరో రెండు, మూడు రోజుల్లో విద్యార్థులకు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొనే అవకాశం కల్పించారు. ఈ విద్యాసంవత్సరంలో క్యూఆర్ కోడ్‌తో హాల్‌టికెట్లను ముద్రించారు.