పెద్దవూర, జూన్ 24 : యువత దుష్ప్రభావాల భారిన పడకుండా ఉండాలని పెద్దవూర ఎస్ఐ వై.ప్రసాద్ అన్నారు. మంగళవారం పెద్దవూరలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీలో ప్రధానోపాధ్యాయుడు మంగ్తా భుక్యా అధ్యక్షతన జరిగిన మాదక ద్రవ్యాల నిరోదక అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాదక ద్రవ్యాలు వినియోగం వల్ల కలిగే అనారోగ్య ప్రభావాలు, ఆర్థిక, సామాజిక దుష్పరిణామాలపై ఎస్ఐ అవగాహన కల్పించారు.
యువత మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దన్నారు. విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్వీపీ మధుసూదన్, జేఎల్ పరశురామ్, యాదగిరి, శ్రీనివాస్, నాగిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Peddavoora : యువత దుష్ప్రభావాల భారిన పడకుండా ఉండాలి : ఎస్ఐ ప్రసాద్