కట్టంగూర్, జూన్ 4 : యోగాను ప్రతి ఒక్కరు దినచర్యలో భాగం చేసుకోవాలని కట్టంగూర్ మండలం అయిటిపాముల ఆయుష్ డిస్పెన్సరీ వైద్యాధికారి ఊర్మిళ అన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో యోగా దశాబ్ది వేడుకలను పురష్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నిర్వహించే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ కార్యక్రమంలో బుధవారం విద్యార్థులు, గ్రామస్తులకు యోగా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన పూర్వీకులు ఇచ్చిన చారిత్రక సంపద యోగాతో ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. యోగా మాస్టర్లు శరత్, నిర్మల యోగా వల్ల కలిగే ఉపయోగాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి ప్రణయ్, ఫార్మాసిస్టులు ఉమారాణి, సైదులు, ఆశ వర్కర్లు రేణుక, సైదమ్మ, శైలజ, సునీత, శోభ పాల్గొన్నారు.