భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 13 : భూదాన్ పోచంపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో మూలమలుపు వద్ద రహదారి గుంతల్లో బ్యాలెన్స్ అదుపుతప్పి ట్రాక్టర్ ట్రాలీ ఫల్టీ కొట్టింది. ట్రాక్టర్ ట్రాలీలో పౌల్ట్రీ ఫార్మ్ సంబంధించిన ఫీడ్ తీసుకెళ్తుంటారు. బుధవారం పౌల్ట్రీ ఫామ్ కి వెళ్తుండగా రహదారి గుంతల్లో నీరు నిలిచి ఉండడం, వెనక ఉన్న టైరు ఓవైపు దిగబడడంతో బ్యాలెన్స్ అదుపుతప్పి మరోవైపు లేచి ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా ఉన్నాడు.