చౌటుప్పల్, జూన్ 28 : ప్రభుత్వ పాఠశాలలో మోనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాలకు వెళ్లి భోజనాన్ని పరిశీలించారు. భోజనం ఎలా ఉందని విద్యార్థులను ఆయన ఆరా తీశారు. ఆర్ఓ ప్లాంట్‌ను పరిశీలించారు. స్వచ్చమైన మంచినీటిని మాత్రమే వాడాలని విద్యార్థులకు సూచించారు. వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రపరిచి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అన్ని సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ వి.శేఖర్‌రెడ్డి, ఏంఈఓ గురువారావు, హెచ్ఎం కర్నె శివకుమార్ ఉన్నారు.
Choutuppal : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : అదనపు కలెక్టర్ వీరారెడ్డి