భువనగిరి కలెక్టరేట్, జూన్ 10 : ఈవీఎంల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ర్రాష్ట చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలోని ఈవీఎం, వేర్ హౌజ్‌ను కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం వేర్ హౌజ్ సీల్‌ను తెరిచారు.
ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భ్రదపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జలకుమారి, డీటీ సురేశ్‌బాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
Bhuvanagiri Collectorate : ఈవీఎంల భద్రతలో ప్రత్యేక జాగ్రత్తలు : సుదర్శన్‌రెడ్డి