చౌటుప్పల్, మే 1 : శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు జరిపిన పోరాట ఫలితమే మే డే అని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ (టీవీఈయూ) హెచ్-82 సంఘం డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని లింగస్వామిగౌడ్ అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ విద్యుత్ శాఖ సబ్ డివిజన్ ఆఫీస్ ఎదుట మే డే ను పురస్కరించుకుని ఆ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్లదన్నారు. నాడు చికాగోలో కార్మికుల హక్కుల కోసం సాధించుకున్న రోజే మే డే అని తెలిపారు. ఆ కార్మికుల స్ఫూర్తితోనే ప్రపంచమంతా మే డే వ్యాపించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు నోముల జైపాల్ రెడ్డి, చింతకింది సురేశ్, బోదుల రామానుజన్, రవి చారి, బర్రె రాజశేఖర్, పులిగిల్ల రవి పాల్గొన్నారు.