‘విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత’
ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుండగా, మరోవైపు విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోందని రూరల్ జోన్ సీఈ బాలస్వామి అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపును బాధ్యతగా పాటించాలని...
– విద్యుత్ శాఖ రూరల్ జోన్ సీఈ బాలస్వామి
చౌటుప్పల్, నవంబర్ 03 : ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుండగా, మరోవైపు విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోందని రూరల్ జోన్ సీఈ బాలస్వామి అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపును బాధ్యతగా పాటించాలని సూచించారు. మంగళవారం చౌటుప్పల్ తంగడపల్లి రోడ్డులోని విద్యుత్ సబ్స్టేషన్లో నిర్వహించిన జాతీయ విద్యుత్ వినియోగదారుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు, టీవీలను ఆఫ్ చేయాలని, గ్రామాల్లో అనవసరంగా వెలుగుతున్న విద్యుత్ దీపాలను నియంత్రించాలని కోరారు.
రైతులు నాణ్యమైన పంపుసెట్లు, రాపిడి లేని ఫుట్వాల్వ్లు, నాణ్యమైన పైపులు, కెపాసిటర్లను వినియోగించాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బిల్లులు, విద్యుత్ సరఫరా, లో వోల్టేజీ సమస్యలు ఉంటే సంబంధిత అధికారులను లేదా లైన్మెన్ను సంప్రదించాలని తెలిపారు. ఈ సందర్భంగా వినియోగదారుల నుండి వచ్చిన 16 ఫిర్యాదులను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా ఎస్ఈ సురేశ్, డీఈ మల్లికార్జున్, చౌటుప్పల్ ఏఈలు రాజుల సతీశ్, దివ్య, ఉమ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత’
Suriya | హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన సూర్య.. ‘సీన్’పై భారీ అంచనాలు!
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
Tusshar Kapoor | రూ.5 కోట్లు ఇవ్వకుంటే లేపేస్తాం.. మరో బాలీవుడ్ నటుడికి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

