Suriya | హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన సూర్య.. ‘సీన్’పై భారీ అంచనాలు!
Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్‌కు 2026 సంవత్సరం గోల్డెన్ పీరియడ్‌లా మారిపోయింది. దాదాపు దశాబ్ద కాలంగా బాక్సాఫీస్ వద్ద సరైన విజయాలు లేక ఇబ్బంది పడిన సూర్య, ఈ ఏడాది ఏకంగా రెండు బ్లాక్‌బస్టర్ హిట్లతో తన సత్తా చాటారు.
Scene Movie | 2026 సంవత్సరం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్‌కు గోల్డెన్ పీరియడ్‌లా మారిపోయింది. దాదాపు దశాబ్ద కాలంగా బాక్సాఫీస్ వద్ద సరైన విజయాలు లేక ఇబ్బంది పడిన సూర్య, ఈ ఏడాది ఏకంగా రెండు బ్లాక్‌బస్టర్ హిట్లతో తన సత్తా చాటారు. ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలతో రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త జోరుమీదున్న సూర్య, ఇప్పుడు తన మూడో సినిమా ‘సీన్’తో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 6న విడుదల కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
గత కొద్ది సంవత్సరాలుగా ‘ఎన్జీకే’, ‘కంగువ’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో సూర్య కథల ఎంపికపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, వాటి నుంచి పాఠాలు నేర్చుకున్న ఆయన ఈ ఏడాది పూర్తిగా భిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదరగొట్టారు. మొదట ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ సోషల్ డ్రామా ‘కరుప్పు’ సినిమాతో సూర్యకు భారీ బ్రేక్ లభించింది. చట్టంలోని లూప్‌హోల్స్‌ను ప్రశ్నిస్తూనే, కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 300 కోట్లు వసూలు చేసి ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ఆ తర్వాత తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి సూర్య చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వయసులో తేడా ఉన్న ప్రేమకథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి భారీ యాక్షన్ సీన్లు లేకుండా కేవలం బలమైన భావోద్వేగాలు, చక్కని హాస్యంతో బాక్సాఫీస్ వద్ద రూ. 209 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ఘన విజయం సాధించడం విశేషం. ఇలా ఈ రెండు సినిమాల ద్వారా సూర్య తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించారు.
ఇప్పుడు మలయాళంలో ‘రోమాంచం’, ‘ఆవేశం’ వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న జితూ మాధవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘సీన్’. నజ్రియా నజీమ్, నాస్లెన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. విభిన్నమైన కథాంశాలతో దూసుకుపోతున్న సూర్య, ఈసారికూడా విజయం సాధించి 2026ను తన నామ సంవత్సరంగా మార్చుకుంటారా లేదా అనేది నవంబర్ 6న తేలనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

