Tusshar Kapoor | రూ.5 కోట్లు ఇవ్వకుంటే లేపేస్తాం.. మరో బాలీవుడ్ నటుడికి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..!
Tusshar Kapoor | ఇటీవల బాలీవుడ్ నటుడు (Bollywood Actor) టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) పై ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్ కాల్పులకు పాల్పడింది. అంతకుముందు కూడా సల్మాన్ ఖాన్ ఇంటిపై బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. ఈ ఘటనలు బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి.
Tusshar Kapoor : ఇటీవల బాలీవుడ్ నటుడు (Bollywood Actor) టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) పై ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్ కాల్పులకు పాల్పడింది. అంతకుముందు కూడా సల్మాన్ ఖాన్ ఇంటిపై బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. ఈ ఘటనలు బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. తాజాగా ఆ గ్యాంగ్ మరో నటుడిని టార్గెట్ చేసింది. బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌ను బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు బెదిరించారు.
లారెన్స్ గ్యాంగ్ సభ్యుడు ‘హ్యారీ బాక్సర్’ పేరిట ఓ వ్యక్తి నుంచి తుషార్ కపూర్‌కు ఫోన్ కాల్ వచ్చింది. తమకు రూ.5 కోట్లు ఇవ్వాలని లేదంటే హత్య చేస్తామని ఫోన్‌చేసిన వ్యక్తి బెదిరింపులకు దిగాడు. దాంతో అప్రమత్తమైన తుషార్ కపూర్ వెంటనే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుషార్ కపూర్ వారం ముందే తమకు ఫిర్యాదు చేశాడని, భద్రతాకారణాల దృష్ట్యా ఈ విషయాన్ని బయటికి వెల్లడించలేదని తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, తుషార్ కపూర్ 30కి పైగా బాలీవుడ్ సినిమాల్లో నటించారు. పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యహరించారు. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ సోదరుడే ఈ తుషార్ కపూర్.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

