Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
ప్రభుత్వ టీచర్ ఉద్యోగం చేయాలనుకునేవారికి అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ అవకాశం కల్పించింది. పలు టీచర్ ఖాళీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ది అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ (AEES) టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 254 ఖాళీలను నింపనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న AEES పాఠశాలల్లో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, పీఆర్టీ లైబ్రేరియన్, పీఆర్టీ మ్యూజిక్ అండ్ బాల్వాటిక పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. దరఖాస్తు నవంబర్ 22తో ముగియనుంది.
పోస్టుల వారీగా ఖాళీలు
ప్రిన్సిపల్- 4
వైస్ ప్రిన్సిపల్- 1
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (PGT)- 27 (ఇంగ్లిష్-4, మ్యాథమెటిక్స్-4, బయాలజీ-2, కెమిస్ట్రీ-3, ఫిజిక్స్-2, కంప్యూటర్ సైన్స్-3, కామర్స్-6, ఎకనామిక్స్-2, హిస్టరీ-1)
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)- 102 (ఇంగ్లిష్-14, సోషల్ స్టడీస్-11, హిందీ-సంస్కృతం-9, కెమిస్ట్రీ-బయాలజీ-13, మ్యాథమెటిక్స్-ఫిజిక్స్-22, కంప్యూటర్ సైన్స్-13, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్-మేల్-7, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్-ఫిమేల్-5, ఆర్ట్ ఎడ్యుకేషన్-7, మరాఠీ-1)
లైబ్రేరియన్- 13
ప్రైమరీ టీచర్ (PRT)- 89
ప్రైమరీ టీచర్ మ్యూజిక్- 10
బాల్వాటిక- 8
అర్హతలు
ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు పీజీతో పాటు బీఈడీ, ఇంటిగ్రేటెడ్ టీచింగ్, బోధనకు సంబంధించిన అర్హతలు, అనుభవం, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
పీజీటీ పోస్టులకు పీజీతో పాటు బీఈడీ లేదా ఇంటిగ్రేటెడ్ అర్హత ఉండాలి.
పీజీటీ కంప్యూటర్ సైన్స్ పోస్టులకు ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్, ఐటీ) ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్‌తో పాటు బోధనకు సంబంధించిన అర్హతలు ఉండాలి.
టీజీటీ పోస్టులకు బ్యాచిలర్/ఇంటిగ్రేటెడ్ డిగ్రీతో పాటు బోధనకు సంబంధించిన అర్హతలు, సీటెట్ పేపర్-2 రాసి ఉండాలి.
టీజీటీ కంప్యూటర్ సైన్స్ పోస్టులకు బీఎస్సీ/బీసీఏ/బీఈ/బీటెక్‌తో పాటు బీఈడీ, DOEACC అర్హత ఉండాలి.
టీజీటీ ఆర్ట్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధిత ఫైన్స్ ఆర్ట్స్ డిగ్రీతో పాటు బీఈడీ ఉండాలి.
లైబ్రేరియన్ పోస్టులకు లైబ్రరీ సైన్స్/లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
ప్రైమరీ టీచర్ పోస్టులకు 12వ తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బోధనకు సంబంధించిన అర్హతలు, సీటెట్ పేపర్-1 రాసి ఉండాలి.
ప్రైమరీ టీచర్ మ్యూజిక్ పోస్టులకు మ్యూజిక్/పర్ఫామెన్స్ ఆర్ట్స్‌లో 12వ తరగతి, బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
బాల్వాటిక పోస్టులకు ఇంగ్లిష్ అండ్ నర్సరీ/ప్రీస్కూల్/ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్‌తో 12వ తరగతి చదివి ఉండాలి.

Aees Posts
వయసు
ప్రిన్సిపల్‌కు 35 నుంచి 50 ఏండ్లు, వైస్ ప్రిన్సిపల్‌కు 35 నుంచి 45 ఏండ్లు, పీజీటీలకు 40 ఏండ్ల లోపు, టీజీటీలు, లైబ్రేరియన్లకు 35 ఏండ్లలోపు, పీఆర్టీ, పీఆర్టీ మ్యూజిక్ బాల్వాటికలకు 30 ఏండ్లలోపు ఉండాలి.
ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5, పీడబ్ల్యూడీ జనరల్‌కు 10, పీడబ్ల్యూడీ ఓబీసీలకు 13, పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీలకు 15 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), పోస్టును బట్టి ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇతర నిర్దేశిత నియామకాల విధానం ద్వారా ఎంపిక ఉంటుంది.
ఫీజు
దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ. 1000, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్సర్వీస్మెన్లకు రూ. 250.
జీతం
ఎంపికైనవారికి నెలకు ప్రిన్సిపల్ పోస్టులకు రూ. 78,800-2,09,200, వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు రూ. 56,100-1,77,500, పీజీటీలకు రూ. 47,600-1,51,100, టీజీటీ, లైబ్రేరియన్లకు రూ. 44,900-1,42,400, పీఆర్టీ, పీఆర్టీ మ్యూజిక్, బాల్వాటికలకు రూ. 35,400-1,12,400 జీతం ఉంటుంది.
చివరితేదీ
దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. నవంబర్ 22తో ముగుస్తుంది. ఇతర వివరాలకు వెబ్సైట్ aees.gov.inలో చూడండి.

Teacher
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
Tusshar Kapoor | రూ.5 కోట్లు ఇవ్వకుంటే లేపేస్తాం.. మరో బాలీవుడ్ నటుడికి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..!
Abdulla Shahid: చిన్నారిపై లైంగిక వేధింపులు.. మాల్దీవులు మాజీ విదేశాంగ మంత్రి అరెస్టు
AP News | తూర్పుగోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థుల హవా.. మూడు వార్డుల్లోనే వైసీపీ ఆధిక్యం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

