రామన్నపేట, జూలై 06 : రామన్నపేట ఎస్ఐగా సతీష్ గోపాతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నలగొండ సీఎస్‌లో బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీపై రామన్నపేటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడతానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నేరాల నియంత్రణకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.