రాజాపేట, మే 19 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా రవీందర్‌రెడ్డి సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలిగా ఉన్న సట్టు జయంత పీఎం ఎస్ఆర్ఐ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని తేలడంతో జిల్లా విద్యాధికారి సత్యనారాయణ ఆమెను బాధ్యతల నుంచి తొలగించారు. మండలంలోని సింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అదనపు బాధ్యతల అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గెజిటెడ్ హెచ్ఎంగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్‌రెడ్డికి మండల విద్యాధికారి చందా రమేశ్ అభినందనలు తెలిపారు.