బీబీనగర్, మే 21 : బీబీనగర్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూం ఇళ్లను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం పరిశీలించారు. డబుల్ బెడ్రూంల వద్ద నీటి సౌకర్యం, విద్యుత్, రోడ్డు ఏర్పాటు పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం లెప్రసీ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న రహదారి సమస్యలను బీబీనగర్ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో చాలా కాలంగా రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలని సర్పంచ్ కోరారు. అనంతరం అధికారులు కాలనీని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ లక్క అలివేలు, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, తాసీల్దార్ శ్యామ్‌సుందర్ రెడ్డి, ఎంఈఓ సురేశ్‌రెడ్డి, పీఆర్ ఏఈ రాకేష్, హౌసింగ్ ఏఈ గీత, పంచాయతీ కార్యదర్శి జాకిరుద్దీన్, ఉపసర్పంచ్ గోలి నర్సింహారెడ్డి, వార్డు సభ్యుడు నెల్లుట్ల శ్రీశైలం పాల్గొన్నారు.