భూదాన్ పోచంపల్లి, జూన్ 25 : తెలంగాణ రెడ్డి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ బొక్క భూపాల్ రెడ్డి 82వ జన్మదిన సందర్భంగా పోచంపల్లి, శివారెడ్డి గూడెం, ఇంద్రియాల, రామలింగంపల్లి గ్రామాల్లో సిమెంట్ బెంచీలను బుధవారం ఏర్పాటు చేశారు. 50 మంది మహిళలకు స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల తాసీల్దార్ కార్యాలయ ఆవరణలో డిప్యూటీ తాసీల్దార్ నాగేశ్వరరావును శాలువాతో ఘనంగా సత్కరించారు .
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ బండి కృష్ణ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నోముల మాధవరెడ్డి, ఆర్ఐ సత్యనారాయణరెడ్డి , నాయకులు చింతల రామకృష్ణ, పబ్బు యాదయ్య, భీమగోని నరసింహ, మొగిలిపాక శంకరయ్య, గంగాపురం మల్లేశ్, బంధారపు శివ, బద్దం బాల్ రెడ్డి, బద్దం వెంకట్ రెడ్డి , కేతావత్ కొమరయ్య , ఇంద్రియాల గ్రామ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి , శివారెడ్డి గూడెం గ్రామ కార్యదర్శి గూడూర్ రజిత, మాజీ ఉప సర్పంచ్ నారి రాజేందర్ , రామలింగంపల్లి గ్రామ నాయకులు మైల శ్రీశైలo, మండల వెంకటయ్య, బంటు గణేశ్ , గంగాదేవి కొండల్ పాల్గొన్నారు.