ఆలేరు టౌన్, ఆగస్టు 13 : ఈ నెల 16న నిర్వహించే గొంగిడి యూత్ ఐకాన్ ర్యాలీని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఆలేరు పట్టణ యూత్ అధ్యక్షుడు పూల శ్రవణ్, పట్టణ సెక్రటరీ జనరల్ కుండే సంపత్ పిలుపునిచ్చారు. బుధవారం ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక పాల కేంద్రంలో గల గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆలేరు అభివృద్ధి ప్రధాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత జన్మదినాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి పాదాల నుండి ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు.
విద్యార్థి, యూత్ విభాగం నాయకులు, గొంగిడి యూత్ ఐకాన్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోయూత్ సెక్రటరీ జనరల్ జింకల భరత్, మహమూద్, ఎలగల హరికృష్ణ, పల్లె మహేశ్, టింకు, చందు, నాగరాజు, నవీన్, పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ బాసాని ప్రశాంత్ పాల్గొన్నారు.