ఆలేరు టౌన్, జూన్ 02 : మల్లేశం సినిమాకు గద్దర్ అవార్డు రావడం ఆలేరుకే గర్వకారణమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఆలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశంను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మల్లేశం సినిమాను గద్దర్ అవార్డుకు ఎంపిక చేయడం నిజంగా ఆలేరు ప్రాంతానికే గుర్తింపు లభించిందన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎం ఏ ఎజాజ్, కొండరాజు వెంకటేశ్వర్లు, చిక్క శ్రవణ్ కుమార్, మెరుగు శ్రీధర్, మహిళా కాంగ్రెస్ నాయకులు నీలం పద్మా వెంకటస్వామి, గుత్తా శమంతరెడ్డి, పాము అనిత, చింతకింది రేణుక, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.