మోత్కూరు, జూన్ 06 : ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మోత్కూరు మండల విద్యాధికారి తీపిరెడ్డి గోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని, నైతిక విలువలతో కూడిన విద్యాబోధన జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో 70 శాతం ప్రభుత్వ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ట్రిబుల్ ఐటీ కళాశాలల్లో మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అరవిందరాయుడు, అంజయ్య, రాంప్రసాద్, వెంకటయ్య, శ్రీనివాస్, లలితకుమారి, రవీందర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, వెంకటాచారి, శ్రీనివాస్, రవికుమార్, లింగయ్య, జయశ్రీ, స్వప్న, వెంకటేశ్వర్లు, విమలమ్మ, అశోక్, పిడి వెంకటరమణ పాల్గొన్నారు.