మత్తు పదార్థాల నివారణకు పాటుపడాలి : ఎస్పీ ఆక్షాష్ యాదవ్
ప్రతి ఒక్కరు మత్తు పదార్దాల నివారణకు పాటు పడాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆక్షాష్ యాదవ్ అన్నారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సావాల్లో భాగంగా నిర్వహించిన 2కే రన్‌ను ఆయన జెండా ఊపి...
రామన్నపేట, అక్టోబర్ 29 : ప్రతి ఒక్కరు మత్తు పదార్దాల నివారణకు పాటు పడాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆక్షాష్ యాదవ్ అన్నారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సావాల్లో భాగంగా నిర్వహించిన 2కే రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్ధులు, యువత, పోలీసులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఆరోగ్యంగా ఉడేందుకు రోజు తమ దిన చర్యగా వ్యాయామం చేయాలన్నారు. ప్రతి రోజు వ్యాయమం చేయడం వల్ల మానసిక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చని అన్నారు. సైబర్ నేరాలకు, మోసాలకు దూరంగా ఉండాలన్నారు.
విద్యార్ధులు, యువత క్రమశిక్షణతో మెలగాలన్నారు. పోలీస్ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజల్లో ఆరోగ్యంపై అవగహన కల్పించడం పట్ల పోలీస్ శాఖకు ప్రజలకు మధ్య సత్సంబధాలను మరింత బలోపేతం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ డీఎస్పీ మధుసుదన్‌రెడ్డి, రామన్నపేట సీఐ ఎం.రవి, ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు, ఎస్ఐలు జి.సతీష్, శ్రీకాంత్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, సతీష్, వెంకట్‌రెడ్డి, ఏఎస్ఐ సురేందర్, హెడ్ కానిస్టేబుళ్లు కమాలాకర్, వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది లింగస్వామి, స్వామి నాయక్, ప్రవీణ్, ప్రశాంత్, స్వామి, మధు, కృష్ణమూర్తి, నర్సింహ్మ, లావణ్య, కవిత, సైదులు, సైదయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మత్తు పదార్థాల నివారణకు పాటుపడాలి : ఎస్పీ ఆక్షాష్ యాదవ్
Y.S. Jagan | చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాం : వైఎస్ జగన్
Woman lost outside Zoo | భర్తతో కలిసి జూకు వెళ్లి అదృశ్యమైన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే?
‘రైతుల భవిష్యత్ పోరాటాలకు నల్లగొండ మహాసభలో కార్యాచరణ’
Chain Snachers | చైన్ స్నాచింగ్ దొంగలను కిష్టమ్మ ఎలా చితక్కొట్టిందో చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

