ఆలేరు టౌన్ ఏప్రిల్ 3 : తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య (Doddi Komaraiah) ఆశయాలను సాధిస్తామని ఆలేరు మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. దొడ్డి కొమురయ్య 98వ వర్ధంతి సందర్భంగా కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆలేరు పట్టణ కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం సర్కారుకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడిన తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అన్నారు.
భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం ఆయన చేసిన పోరాటాలను కొనియాడారు. నేటి సమాజానికి దొడ్డి కొమురయ్య పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నివాళులర్పించిన వారిలో గొర్ల కాపరుల సంఘం జిల్లా డైరెక్టర్ జల్లి నరసింహులు. ఎ ఎం సీ మాజీ డైరెక్టర్ పత్తి వెంకటేష్, బీఆర్ఎస్ మాజీ పట్టణ అధ్యక్షుడు మొరిగాడి వెంకటేష్ గౌడ్, మంగ నరసింహులు, గవ్వల నరసింహులు, జూకంటి ఉప్పలయ్య దయ్యాల సంపత్, ఎగ్గిడి శ్రీశైలం, యాదగిరి, శ్రీకాంత్, పిక్క శ్రీనివాస్, మల్లేష్ శ్రీను, కురుమ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.