చౌటుప్పల్ , జూన్ 14 : చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగోజిగూడెం గ్రామ పరిధిలోని దివీస్ పరిశ్రమకు రాష్ట్ర ఉత్తమ రక్తదాన అవార్డు లభించింది. తెలంగాణ రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రపంచ రక్తదాన దినోత్సవంలో భాగంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు పరిశ్రమ మేనేజర్ పెండ్యాల సుధాకర్ శనివారం తెలిపారు. గత పదేండ్ల నుండి ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీ వారికి అధికంగా బ్లడ్ యూనిట్స్‌ను అందించినందుకు గానూ ఈ అవార్డు లభించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సోసైటీ ప్రతినిధులు డాక్టర్ నటరాజ్, డాక్టర్ ఆమరేందర్ రెడ్డి, దివీస్ లైజన్ ఆఫీసర్ బి.కిశోర్ కుమార్ చౌదరి పాల్గొన్నారు.