చౌటుప్పల్, జూన్ 28 : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాలను వేగవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. శనివారం చౌటుప్పల్ మండల పరిధిలోని మసీదుగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఇందుకోసం గ్రామాల్లో పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ పథకంపై అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి.సందీఫ్, ఎంపీఓ వి.అంజిరెడ్డి, పంచాయతీ సెక్రటరీ పాల్గొన్నారు.