రామన్నపేట, జులై 09 : కంప్రెషర్ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట శివారులో బుధవారం చోటుచేసుకుంది. గుర్రంపోడు మండలానికి చెందిన వేముల సంజీవ (35) ఏపీ 27 బీఎస్ 5800 నంబర్ గల కంప్రెషర్ ట్రాక్టన్ను నడుపుకుంటూ వెల్లంకి గ్రామం వైపు వెళ్తుండగా రామన్నపేట శివారులో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో డ్రైవర్ సంజీవకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు ట్రాక్టర్ యజమానికి సమాచారం అందించడంతో ట్రాక్టర్ యజమాని చికిత్స కోసం సంజీవను నార్కట్పల్లి కామినేని దవాఖానాకు తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.