యాదాద్రీశుడిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ దంపతులు
యాదాద్రీశుడిని దర్శించుకున్న సీజేఐ | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఎన్వీ రమణ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో ఎదురేగి స్వాగతం పలికారు.

యాదాద్రి భువనగిరి : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఎన్వీ రమణ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం ఎన్వీ రమణ దంపతులు బాలాలయంలో ప్రత్యేక పూజలు, అర్చన, అభిషేకం నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు. అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి శేషవస్త్రం, చిత్రపటంతోపాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఈఓ సీజేఐ దంపతులకు ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించారు.
అంతకుముందు వీవీఐపీ అతిథి గృహం వద్ద మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఎన్వీ రమణ దంపతులకు ఘన స్వాగతం పలికారు. లక్ష్మీనరసింహస్వామివారి దర్శనం అనంతరం ఆలయ పునర్ నిర్మాణ పనులను వారు వీక్షించనున్నారు. ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో చేపట్టిన నిర్మాణ పనులు, ప్రెసిడెన్షియల్ విల్లా కాంప్లెక్స్ పనులు, ఆలయ నగరిని జస్టిస్ ఎన్వీ రమణ పరిశీలించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్ విడుదల.. ఈ చిత్రంతో ఆసక్తికరమైన సంకేతాలు!
IND vs NZ | శ్రేయస్, ఇషాన్ హాఫ్ సెంచరీలు .. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..!
Cop Arrested For Raping Woman | పోలీస్ స్టేషన్లో మహిళపై అత్యాచారం.. కానిస్టేబుల్ అరెస్ట్, మరో ఐదుగురు సస్పెండ్
Karepalli | మాజీ ప్రిన్సిపల్ దారా సావిత్రి అకాల మృతి విద్యారంగానికి తీరని లోటు
Anupama Parameswaran | నాతో క్షమాపణలు చెప్పించారు.. ఇప్పుడు అవే పనులు బహిరంగంగా చేస్తున్నారు: అనుపమ ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

