భువనగిరి అర్బన్: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయని ఎమ్మె ల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని అనాజిపురం నుంచి జిట్టవారి బావి మీదుగా నమాత్‌పల్లి వరకు బీటి రోడ్డు మంజూరు చేసి ప్రారంభించిన సందర్భంగా గురువారం నమాత్‌పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన నాయకులు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పార్టీ గులాబీ కండువాను కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే మౌలిక వసతుల ఏర్పాటు జరుగుతుంద న్నారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ, బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు ప్రజా సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుం దన్నారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరిస్తానని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల, మండలాధ్యక్షుడు జనగాం పాండు, నాయకులు అతికం లక్ష్మీనారాయణ, సర్పంచ్ ఎడ్ల రాజిరెడ్డి, మండల మహిళా అధ్యక్షు రాలు చంద్రమ్మ, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.