భూదాన్ పోచంపల్లి, జూన్ 26 : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని 7, 12వ వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పభుత్వ మార్గదర్శకాలను పాటించాలన్నారు. 600 చదరపు అడుగుల లోపు ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. అనంతరం మద్దెలమ్మదేవి దేవాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.
ఈ కార్య్రకమంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు భారత లవకుమార్, పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ తడక రమేశ్, మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ రాజేశ్, ఏ కే ఎల్ బి కాంప్లెక్స్ చైర్మన్ గుండు శ్రీరాములు, దేవాలయ చైర్మన్ సూరపల్లి రాము, నాయకులు కడవేరు వెంకటేశ్, మంగళపల్లి రాజారమేశ్, కుడికాల రామనరసింహ, వేముల ఆనంద్, భారత భూషణ్, మెరుగు శశికళ, మేకల రామకృష్ణ, బైరు రామాంజనేయులు, కుసుమ వెంకటేశ్, కూరపాటి భాస్కర్, అరవింద్, గణేశ్, భోగ గణేశ్, జోగు శ్రీనివాస్, స్వాతి, జ్ఞానేశ్వరి పాల్గొన్నారు.