ఆత్మకూరు(ఎం), నవంబర్ 21 : గ్రామాల్లో ఉన్న పురాతన పరికరాలు, వస్తువులను నాగార్జునసాగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యూజియానికి అందివ్వాలని తెలంగాణ ఉద్యమకారుడు, మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు అన్నారు. శుక్రవారం ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల జీవన శైలి కోసం ఏర్పాటు చేసిన మ్యూజియానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వివిధ గ్రామాల్లో బయట పడుతున్న పురాతన వస్తువులు, పరికరాలు, విగ్రహాలు, నాగండ్లు, వ్యవసాయ పరికరాలు, రాతి, ఇత్తడి విగ్రహాలు, ఆదివాసి, జానపద కళలకు సంబంధించిన చిత్రాలను అందజేయాలని కోరారు. వివరాల కోసం 9848015364 నంబర్‌కు ఫొన్ చేసి సంప్రదించాలని పేర్కొన్నారు.