ఆలేరు టౌన్, మే 29 : ఆలేరు పట్టణ కేంద్రంలోని కనకదుర్గా మాత ఆలయ 10వ వార్షికోత్సవాన్ని జూన్ 4, 5, 6 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు గురువారం తెలిపారు. ఈ మేరకు ఆలేరు సీఐ కొండల్రావును మర్యాదపూర్వకంగా కలిసి వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఆలేరు పట్టణ ప్రజలు, భక్తులు వార్షికోత్సవాలకు అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కొలుపుల హరినాథ్, బేతి రాములు, మంగ నరసింహులు పాల్గొన్నారు.