
యాదగిరిగుట్ట రూరల్, ఆగస్ట్1: తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలి అలమటించకూడదనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కర్రె వెంక టయ్య అన్నారు. ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేష న్ కార్డులను ఆదివారం గ్రామంలోని లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కర్రె వెంకటయ్య మాట్లాడుతూ పేదల కడుపు నింపే యజ్ఞానికి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చు ట్టిందన్నారు. ఎవరు ఆకలితో అలమటించకూడదని దరఖాస్తు చేసుకు న్న అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేసిందన్నారు. మల్లాపురంలో 20మంది లబ్ధిదారులకు కార్డులు మంజూరైన ట్లు తెలిపారు. కార్యక్రమంలోఎంపీటీసీ విజయ, భిక్షపతి, ఎల్ల య్య, మాధవరెడ్డి, మల్లేశ్, వీఆర్ఏ కరుణాకర్ పాల్గొన్నారు.
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఆత్మకూరు(ఎం): ప్రజా సంక్షేమంలో భాగంగా అన్ని వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాల ను విద్యార్థి సంఘ నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీ ఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు చుంచు నాగరాజు అన్నారు. ఆది వారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్వీ మండల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిరుద్యోగులకు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలతో పాటు రైతు బంధు, దళిత బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, కొత్త రేషన్ కార్డుల పంపిణీపై ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో నా యకులు వంశీకృష్ణ, సతీశ్, మహేశ్, మహేందర్రెడ్డి, పరశురా ములు, మణికుమార్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.