
యాదాద్రి, ఆగస్టు30: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో సోమవారం హరిహరులకు ప్రత్యేక పూజలు కొనసాగాయి. వైష్ణవాగమశాస్త్రరీతిలో యాదాద్రీశుడికి, శైవాగమశాస్త్రరీతిలో కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి అర్చకులు పూజలు నిర్వహించారు. శివుడికి రుద్రాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుతమైన అవకాశం ఉండటంతో రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన వెంటనే యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. ప్రభాతవేళలో మొదటగా గంటన్నరపాటు శివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకించారు. శివుడిని విభూతితో అలంకరించారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణప తి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలను అభిషేకించి అర్చన చేశారు. నిత్యపూజలు ఉద యం నాలుగు గంటల నుంచి ప్రారంభమయ్యా యి. బాలాలయంలో కవచమూర్తులను అభిషేకించి అర్చించిన అర్చక బృందం బాలాలయంలో శ్రీసుదర్శన నారసింహహోమాన్ని జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి నిత్యకైంకర్యాలలో పాల్గొని మొ క్కు లు చెల్లించుకున్నారు. శ్రావణమాసం సందర్భంగా సత్యనారాయణస్వామి వ్రతాల్లోనూ భక్తులు అధి క సంఖ్యలో పాల్గొన్నారు.
స్వామివారి ఖజానాకు రూ.14,74,417 ఆదాయం
స్వామివారి ఖజానాకు రూ.14,74,417 ఆదా యం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.2,43,978, రూ.100 దర్శనంతో రూ.25,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ.1,33,650, సుప్రభాతంతో రూ.200, క్యారీబ్యాగులతో రూ.4,030, సత్యనారాయణ స్వామి వ్రతాలతో రూ.1,16,500, కల్యాణకట్టతో రూ. 37,000, ప్రసాద విక్రయంతో రూ.4,87,520, శాశ్వతపూజలతో రూ.6,000, వాహనపూజలతో రూ.9,300, టోల్గేట్తో రూ.1,670, అన్నదాన విరాళంతో రూ.6,203, సువర్ణ పుష్పార్చనతో రూ.1,34,500, యాదరుషి నిలయంతో రూ. 78,040, పాతగుట్టతో రూ.32,335, ఇతర విభాగాలతో రూ.1,58,491తో కలుపుకొని రూ. 14,74,417 ఆదాయం సమకూరిందన్నారు.