నీలగిరి, ఏప్రిల్ 29 : ఆదివారం జరిగే కానిస్టేబుల్ తుది పరీక్షకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లా అభ్యర్థులకు నల్లగొండ జిల్లా కేంద్రంలో 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 11,239 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షకు ఒక నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరించనున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్దకు గంట ముందుగానే చేరుకోవాలని జిల్లా యంత్రాంగం సూచించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహణ జరుగనుంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్నెట్ సెంటర్స్ మూసేయాలని, పరీక్ష కేంద్రం నుంచి 500 మీటర్ల వరకు ప్రజలు గుమికూడ వద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
అభ్యర్థులకు సూచనలు..
ఏర్పాట్లు పూర్తి
ఆదివారం జరిగే కానిస్టేబుల్ తుది పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11,239 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నందున 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశాం. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతి లేదు. అభ్యర్థులు గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి.
– కె.అపూర్వరావు, ఎస్పీ, నల్లగొండ