నల్లగొండ రూరల్, మే 31: అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పానగల్లో (Panagal) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామినేని మెడికల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ డాక్టర్ మారుతి శర్మ మాట్లాడుతూ పొగాకు వల్ల కలిగే ప్రమాదాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
గొంతు క్యాన్సర్ గుండె జబ్బులు, ఊపిరితిత్తులు క్షయ వ్యాధి, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులు గురించి పానగల్ ప్రజలకు అవగాహన కలిగించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కామినేని మెడికల్ కాలేజ్ దత్తత తీసుకున్నా గ్రామాలలో పోగాకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ రత్న బాలరాజ్, డాక్టర్ సాయినాథ్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ బద్దం నగేష్, డాక్టర్లు వర్షిత్ రెడ్డి, శశిధర్ రెడ్డి, జోషి అయ్యప్ప, అజిత్, వరుణ్ కార్తీక్, శశాంక్, సోను, టెక్నీషియన్ షాముద్దీన్, ఏఎన్ఎమ్ విజయమ్మ, శారద, యాదవ రెడ్డి, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.