ఖోఖో రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక
56వ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పురుషుల, మహిళల జట్లను భువనగిరి జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఎంపిక చేశారు.
భువనగిరి సిటీ, జనవరి 21 : 56వ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పురుషుల, మహిళల జట్లను భువనగిరి జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులకు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 8 వరకు సాయికృప కళాశాల క్యాంపస్లో కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణమూర్తి తెలిపారు. కోచింగ్ క్యాంపునకు 20 మంది మహిళలు, 20 మంది పురుషులను ఎంపిక చేసినట్లు చెప్పారు.
ఫిబ్రవరి 9నుంచి 11 వరకు జూనియర్ కళాశాల గ్రౌండ్లో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఖోఖో సంఘం ఉపాధ్యక్షుడు పి.రమేశ్రెడ్డి, కోశాధికారి ఎ.విజయ్, జాయింట్ సెక్రటరీ కె.మురళి, ఆర్గనైజ్ సెక్రటరీలు పి.ఆంజనేయులు, పి.శ్రీశైలం, జి.బాలకృష్ణ, సురేందర్, కోచ్ స్వాతి, పీఈటీలు బి.కేశనాగులు, నాగేంద్ర, వెంకట్రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

