రామగిరి : నల్గొండ ఎన్.జీ కళాశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) మంగళవారం సందర్శించారు. కళాశాల గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్న వారితో మాట్లాడి అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. వాకింగ్ ట్రాక్( Walking Track) మరమ్మతులు, ఓపెన్ జిమ్( Open Jim) అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆమె వెంట జాయింట్ కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, మునిసిపల్ కమిషనర్ ఉన్నారు.
ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సీఈవో ఎం.వి. గోన రెడ్డి కలెక్టర్కు , అధికారులకు ఫౌండేషన్ తరఫున పుస్తకాలు అందజేశారు. ఫౌండేషన్ ద్వారా ఎన్.జీ. కాలేజ్ లో జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, భవిష్యత్తులో మరింత సహకారం అందించేందుకు సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమానికి వంగల అనిల్ రెడ్డి, బండారు ప్రసాద్, డాక్టర్ పుల్లారావు, జి. లింగయ్య, శౌరయ్య, చింతపల్లి వెంకన్న, రిటైర్డ్ పోలీసు అధికారులు, సరళ యాసా, కోమటిరెడ్డి బుచ్చి రెడ్డి దంపతులు, కట్టా అమృత రెడ్డి, బీమార్జున్ రెడ్డి, శ్రీ కొప్పుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.