ఎమ్మెల్యే చిరుమర్తి
చిట్యాల, ఫిబ్రవరి 9 : చిట్యాల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. పట్టణంలోని 3, 6,10 వార్డుల్లో రూ.60 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి ఆధునీకరించిన అంబేద్కర్ భవనాన్ని, శివనేనిగూడెంలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ నెల 12న భువనగిరిలో నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలను భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. పట్టణానికి చెందిన గుంటోజు మణితేజను పరామర్శించి కుడికాలు శస్త్ర చికిత్సకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని చెప్పి తక్షణ సాయంగా రూ.5 వేలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ జడల ఆది మల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి, కమిషనర్ రామదుర్గారెడ్డి, పీఆర్ ఏఈ శంకర్‌బాబు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య పాల్గొన్నారు.