చందంపేట (దేవరకొండ) : భూ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెండ్లిపాకల కెనాల్లో ముంపునకు గురవుతున్న రైతులకు ప్రభుత్వం నుంచి మంజూరైన నష్ట పరిహారం చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకే ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్ తరాలకు ఈ ప్రాజెక్ట్ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లీలా, ఇరిగేషన్ ఈఈ నెహ్రూ, పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ బుజ్జి లచ్చిరాం నాయక్ పాల్గొన్నారు.