నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), మార్చి 17 : రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భగత్ సింగ్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్ అన్నారు. భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) నల్లగొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణ కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు, యువకులు డ్రగ్స్ భారిన పడుతూ తమ విలువైన జీవితాన్ని మధ్యలోనే చాలించే ప్రమాదం ఉంది కనుక అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.
కేంద్రంలో బీజేపీ భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో నుంచి పూర్తిగా తొలగించడం కోసం కంకణం కట్టుకుందన్నారు. గల్లీస్థాయిలో కూడా త్యాగాలు చేయనివాళ్లను ఢిల్లీ స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి పాలక ప్రభుత్వాలు. కానీ భగత్ సింగ్ లాంటివారి చరిత్రలను ప్రచారం చేయడానికి పాలక ప్రభుత్వాలు జంకుతున్నట్లు చెప్పారు. భగత్ సింగ్ ఆశయ సాధన కోసం విద్యార్థులు, యువకులు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు ఖమ్మంపాటి శంకర్, మల్లం మహేశ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, కుర్ర సైదా నాయక్, గుండాల నరేష్, పతాని శ్రీను, కట్ట లింగస్వామి, మిర్యాల భరత్, కోరే రమేష్, బుడిగ వేంకటేష్, ముస్కు రవీందర్, పాలది కార్తీక్, మారుపాక కిరణ్, రవి, కావ్య, స్పందన, జగదీష్, జగన్ నాయక్, మాలికంటి చంద్ర శేఖర్, దండేంపలి లక్ష్మణ్, సంపత్, నరేష్, పాల్గొన్నారు.