నందికొండ, జులై 04 : తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ డ్యామ్ ఎడమ కాల్వకు ఎన్ఎస్పీ అధికారులు శుక్రవారం నీరు విడుదల చేశారు. వెయ్యి క్యూసెక్కులతో ఎడమ కాల్వకు నీటి విడుదలను ప్రారంభించి క్రమంగా నీటి విడుదలను పెంచుకుంటూ 3 వేల క్యూసెక్కులతో కొనసాగిస్తామన్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ నింపడానికి 1 టీఎంసీ నీటిని కేటాయించినట్లు, ఒక టీఎంసీ మేర నీటి విడుదల ఎడమ కాల్వకు కొనసాగుతుందన్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకు గాను 522.20 అడుగుల వద్ద 153.3180 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.
నాగార్జునసాగర్ డ్యామ్ ఎడమ కాల్వ ద్వారా 1,623 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 900 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. కుడికాల్వ, జలవిద్యుత్ కేంద్రాల ద్వారా నీటి విడుదల లేదు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుండి 2,523 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతుండగా, 54,051 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం ద్వారా నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ గరిష్ట నీటి మట్టం 885 అడుగులకు గాను 875.90 (167.8746 టీఎంసీల) అడుగులకు మేర నీరు చేరింది.
Nandikonda : సాగర్ ఎడమ కాల్వకు నీరు విడుదల