గుర్రంపోడు, మార్చి 28 : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరాలను గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ అన్నారు. శనివారం గుర్రంపోడు పీహెచ్సీలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీల పరిధిలో ఈ నెలాఖరు వరకు అన్ని విభాగాల వైద్యులచే ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 150 మంది రోగులను పరీక్షించగా మెరుగైన వైద్యం అవసరమైన వారిని నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. ఈ శిబిరం నల్లగొండ జనరల్ ఆస్పత్రి వైద్యులు ప్రవల్లిక, హర్షిత, భావన, జయంత్, కత్యానిదేవి, ప్రణీత రోగులను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ భవానీ చక్రవర్తి, సర్పంచ్ జాల యాదయ్య, సూపర్వైజర్లు సైదులు, విజయమ్మ, ఫరీద్, ఏఎన్ఎం రత్మమ్మ, ఆశా చెన్నమ్మ పాల్గొన్నారు.