నల్లగొండ: టీఆర్ఎస్ పార్టీకి విధేయులుగా ఉండే వారికే కమిటీల్లో స్థానమివ్వాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల పరిశీలకులు నిష్పక్షపాతంగా వ్యవహరించి వారికి కేటాయించిన గ్రామాలు, వార్డుల్లో ఆయా ముఖ్య కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులను సమన్వయం చేసుకొని పార్టీ కమిటీ, అనుబంధ కమిటీలను వేయాలని కోరారు.
పార్టీ పట్ల అంకితభావంతో పని చేసిన వారికే బాధ్యతలు ఇస్తే పార్టీ అభివృద్ధితోపాటు వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చేవిధంగా కృషి చేస్తారని అన్నారు. సెప్టెంబర్ 2న ఉదయం తొమ్మిది గంటలకు అన్ని గ్రామాలు, పట్టణాల్లో జెండా ఎగురవేయాలని సూచించారు. ఎన్నికల పరిశీలకులు వీడియో కాల్స్ ద్వారా ఆయా ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాలను పరిశీలించాలని అన్నారు.
సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, కటికం సత్తయ్య గౌడ్, కనగల్ జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ అభిమన్యు శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు, పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, దేప వెంకట్‌రెడ్డి, అయితగోని యాదయ్య, పాశం సంపత్‌రెడ్డి, ఆలకుంట్ల నాగరత్నంరాజు పాల్గొన్నారు.