అర్వపల్లి, ఏప్రిల్ 10 : బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం పర్సాయపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా మిర్యాల వెంకన్న ఎంపికయ్యారు. గురువారం గ్రామంలో పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడిగా మిర్యాల వెంకన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు మొరిశెట్టి ఉపేందర్, కొప్పుల భరత్ రెడ్డి, మండల గ్రంథాలయ మాజీ చైర్మన్ పి.యుగేంధర్, మాజీ ఎంపీటీసీలు బొడ్డు భద్రమ్మ, రామలింగయ్య యాదవ్, రాచకొండ గీత సురేశ్, తోట కృష్ణ కళనరసయ్య, అంకిరెడ్డి లింగయ్య, మండల నాయకులు సురేశ్, తొట్టే లింగయ్య, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు బానోతు శ్రీను, కేసారపు వెంకన్న వార్డ్ మెంబర్లు పుప్పాల ప్రభాకర్, బానోతు సైదులు, కొప్పు శారద, కృష్ణ, శివరాత్రి రేణుక, కృష్ణ, ప్రియాంక, సుధాకర్ పాల్గొన్నారు.