నల్లగొండ సిటీ, అక్టోబర్ 27 : కనగల్ మండల ఎంపీడీఓగా వేద రక్షిత నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడ ఉన్న ఎంపీడీఓ జయరాం బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఎంపీఓ సుమలతను ఇన్చార్జి ఎంపిడీఓగా నియమించారు. నూతనంగా నియమితులైన వేద రక్షిత ఎంపీటీఓగా సోమవారం రాత్రి బాధ్యతలు స్వీకరించనున్నారు.