రామగిరి, ఆగస్టు 05 : ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూఎస్పీసీ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. బక్క శ్రీనివాస చారి, కె.రత్నయ్య, బి.వెంకటేశం అధ్యక్ష వర్గంగా నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి ముఖ్య అతిథిగా పాల్గొన్న టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. కొత్త రాష్ట్రం ఏర్పడి 11 ఏండ్లు గడిచినా ప్రభుత్వ విద్యారంగ పరిస్థితి ఇంకా మెరుగు పడకపోవడం శోచనీయం అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడిచినప్పటికీ దీర్ఘకాలంగా పరిష్కారం కానీ అనేక సమస్యలు అలాగే ఉన్నాయని, ఉద్యోగుల బిల్లులు అనేకం పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించకుండా, కొత్త కొత్త పేర్లుతో నూతన పాఠశాలను ప్రారంభించడం, ఎక్కువ మంది చదివే విద్యార్థులు ఉన్న పాఠశాలలకు తక్కువ నిధులు ఖర్చు చేస్తూ, తక్కువ విద్యార్థులు ఉన్నచోట ఎక్కువ ఖర్చు చేయాలని ప్రభుత్వం ఆలోచనలు చేస్తూ, మరోవైపు విద్యలో కార్పొరేట్ శక్తులను నియంత్రికపోవడం ద్వారా సామాజిక అంతరాలను పెంచి పోషిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తామని భరోసా ప్రజలకు కల్పించలేక పోతున్నారని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ మేరకు వెంటనే సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 23న హైదరాబాద్ లో రాష్ట్రస్థాయి మహా ధర్నా నిర్వహిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం యూఎస్పీసీ నాయకులు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి మెమోరాండం అందజేశారు.
– అన్ని క్యాడర్ల బదిలీల షెడ్యూల్ ని తక్షణమే విడుదల చేయాలి
– జీఓ నంబర్ 25ను సవరించాలి. ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. 40 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక టీచర్ ఉండాలి. ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్ వర్క్ లోడ్ కు అనుగుణంగా టీచర్ పోస్టులు కేటాయించాలి
– అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి
– రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుల పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయాలి
– కేంద్ర ప్రభుత్వం మెమో నంబర్ 57/05/2021/D&PW.(B)DATED :03.03.2023 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఆప్షన్ ఇవ్వాలి
– సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలి
– స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఏకీకృత సర్వీస్ నిబంధనలు రూపొందించి డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ, డైట్, బీఈడీ కళాశాలల అధ్యాపకుల ఖాళీల్లో శాశ్వత నియామకాలు చేపట్టాలి
– నూతన జిల్లాలకు డీఈఓ పోస్టులు ప్రతి రెవిన్యూ డివిజన్ కు డిప్యూటీ ఈఓ పోస్టులు, నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేయాలి
– 5,571 పీఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలి
– బీఈడీ, డీఈడీ అర్హతలు ఉన్న ఎస్జీటీలందరికీ సీనియార్టీ ప్రకారం పీఎస్ హెచ్ఎం ప్రమోషన్ అవకాశం కల్పించాలి
– అప్‌గ్రేడేషన్ ప్రక్రియ పూర్తయినందున జీఓ 2, 3, 9, 10 లను రద్దుచేసి జీఓ 11,12 ల ప్రకారం ఎస్ జి టి/ఎల్ పి/పి.ఈ టి లకు కామన్ సీనియార్టీ ప్రకారం పదోన్నతులు కల్పించాలి
– సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలి
– కేజీబీవీ, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం బేసిక్ పే అమలు చేయాలి
– మోడల్ స్కూల్స్, గురుకుల సిబ్బందికి 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలి
– మోడల్ స్కూల్స్, గురుకుల, ఎయిడెడ్ టీచర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలి
– పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని 01.07.2023 నుండి అమలు చేయాలి
– గురుకుల పాఠశాల టైం టేబుల్ ను శాస్త్రీయంగా సవరించి, విద్యార్థులు, ఉపాధ్యాయులకు అనుకూలంగా మార్పు చేయాలి
– 398 టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి.
– ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం చేయాలి.ఎయిడెడ్ టీచర్లకు ప్రమోషన్లు కల్పించాలి
– పాఠశాలలో విద్యార్థుల అవసరాలకు కాకుండా వ్యక్తుల అవసరాలకు ఇస్తున్న పైరవీ డెప్యుటేషన్లను రద్దు చేయాలి.
– అర్హత లేని, ఆరోపణలు ఉన్న డీఈవోలను తొలగించాలి. దీర్ఘకాలంగా ఒకే జిల్లాలో ఉన్న వారిని బదిలీ చేయాలి
– అన్ని జిల్లాలకు శానిటేషన్ గ్రాంట్లు విడుదల చేయాలి
– కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ మేరకు ప్రతి సంవత్సరం వేసవిలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలి
ఈ కార్యక్రమంలో యూఎస్పీసీ నాయకులు జి.నాగమణి, పెరుమాళ్ల వెంకటేశం, పి.వెంకులు, ఖురుషీద్ మియా, నర్రా శేఖర్ రెడ్డి, వడిత్య రాజు, జి.అరుణ, యాట మధుసూదన్ రెడ్డి, నలపరాజు వెంకన్న, మురలయ్య, పగిళ్ల సైదులు, కొమర్రాజు సైదులు, గణేశ్, ఈర అంజయ్య, ఆర్.లక్ష్మయ్య, జగతి, మూర్తి, వై.సైదులు, శ్రీదేవి, సంధ్య, వివిధ మండల నాయకులు పాల్గొన్నారు.