నిడమనూరు, జూలై 25 : నిడమనూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కిసాన్ సంగోష్టి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సేంద్రీయ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం మాట్లాడుతూ.. రసాయనికి ఎరువుల అధిక వాడకం వల్ల ప్రతిఏటా భూసారం తగ్గిపోతుందన్నారు. దీంతో రాబోయే రెండు మూడు తరాల్లో వ్యవసాయానికి ఉపయోగపడే భూమి ఎక్కడా లేకుండా పోతుందన్నారు. కావునా భూసారాన్ని పరిరక్షించుకోవాలంటే రైతులు కృత్రిమ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ ఎరువుల వాడకం పెంచాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ విరిగినేని అంజయ్య, ఏఓ ముని కృష్ణయ్య, మద్రాస్ ఫెర్టిలైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మిర్యాలగూడ అడిషనల్ మేనేజర్ రామారావు, హెడ్ క్వార్టర్ ఏఈఓ దండెం విజయచంద్ర, ఏఈఓలు క్రాంతి కుమార్, మహేశ్, అనీల్ నాయక్, రైతులు శివమారయ్య, ఓబిలినేని రామకృష్ణ రావు, ఎడబాల వెంకటేశ్వరరావు, చర్క శ్రీను, చామల యాదగిరిరెడ్డి, సుధాకర్ రావు, మోసాల శ్రీను, రవి పాల్గొన్నారు.